ఐపీఎల్ మళ్లీ మొదలవుతుంది

ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు శ్రద్ధాకపూర్‌!
దిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ఐపీఎల్‌-10వ సీజన్‌ ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఐపీఎల్‌ నిర్వాహకులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రారంభ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకాలేని వారి కోసం ఏదైనా చేయాలని ఆలోచించిన నిర్వాహకులు కొత్త ఒరవడికి తెరలేపారు. ఈ సీజన్‌లో సుమారు 8 మైదానాల్లో ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతి జట్టు హోమ్‌ గ్రౌండ్‌లో ఆడే తొలి మ్యాచ్‌కి ముందు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, ఇండోర్‌, ముంబయి, పుణె, రాజ్‌కోట్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ క్రమంలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ప్రారంభ వేడుకల్లో శ్రద్ధాకపూర్‌ తన డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈ కార్యక్రమానికి శ్రద్ధా తండ్రి శక్తి కపూర్‌ కూడా హాజరవుతారట. అలాగే రాజ్‌కోట్‌లో నిర్వహించే వేడుకల్లో టైగర్‌ ష్రాఫ్‌ ధూమ్‌ సినిమాలోని పాటకు నర్తించనున్నారు.

Comments

Post a Comment

Popular posts from this blog

ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు

ప్రజలు తినే తిండి కూడా ప్రభుత్వ పర్మిషన్??

ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema