• ముల్ల పందిని మింగి.... నరకయాతన పడింది..
బ్రెజిల్‌: అనగనగా ఓ పాము. ఆకలేసి ముళ్ల పందిని మింగేసింది. కానీ ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచించి ఉంటే దానికి ఇంత కష్టం వచ్చి ఉండేది కాదు. బోవా జాతికి చెందిన ఆ పాము కక్కుర్తిపడి ముళ్ల పందిని మింగేసింది. తీరా పంది కడుపులోకి వెళ్లాక దాని ముళ్లన్నీ పాము శరీరంలోంచి బయటకు చొచ్చుకువచ్చాయి. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. పాము శరీరం నుంచిముళ్లు బయటికి రావడం గమనించిన స్థానికులు అదేదో వింత పాము అనుకుని వీడియో తీశారు. ఓ పక్క ముళ్లు గుచ్చుకుని శరీరం తూట్లు పడి ఆ పాము నరకయాతన పడుతుంటే దాని అరుపులు విని ఓ కుక్క దానిపై దాడి చేసింది. దాంతో ఆ పాము బాధ మరింత ఎక్కువైంది. కుక్క దాడి నుంచి తనని తాను కాపాడుకోవడానికి శరీరాన్ని ముడుచుకోవాలని ప్రయత్నించింది కానీ ముళ్లు గుచ్చుకుంటుండంతో ఏమీచేయలేని స్థితిలో ఉండిపోయింది. బోవా జాతికి చెందిన సర్పాలు ఎక్కువగా గబ్బిలాలు, ఎలుకలు, పక్షులు, బల్లులు తింటుంటాయి. వీటికి తిండి ఆరగించుకోవడానికి కసీనం నాలుగు నుంచి ఆరు రోజులైనా పడుతుంది

Comments

Popular posts from this blog

ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు

ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema

దుబాయ్ లో జాగ్రత్త. . యుఎఇ లో కొత్త చట్టాలు