దలితుడిగా పుట్టినందుకా ఇతను చేసిన పాపము...
ఇదా నా దేశము నా దలితులకిచ్చిన గౌరవము...
చట్టమా ? నువు ఎవరి పక్షం ... ?
మంథిని లో కుల అహంకారీనికి మదుకర్ భళి...
వివరాలు మిత్రుడు రాము బీరెల్లి వాలు నుండి
......................................
◆●◆ 19 మార్చ్ 1990 కంచికచెర్ల కోటేశు హత్య...
మళ్ళీ...
14 మార్చ్ 2017 తెలంగాణాలో హత్య గావించబడ్డాడు..!!!!😢😢😢😢😢😢
◆కథ పాతదే....
◆కారణాలు పాతవే....
◆కక్షలు పాతవే....
◆■ పేర్లు మారాయి..
◆■ ఊర్లు మారాయి..
తెలంగాణా రాష్ట్రంలో...
మంథని మండలంలో..
అవును మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ లో..
TRS నేతలే.. హంతకులు..
అవును.. బంగారు తెలంగాణా నిర్మాతలే ..!!!
ఈ హత్యకు డైరెక్టర్లు....
◆■ ఫ్యాక్షనిస్టు లను మరపించారు..!!
◆■ నరహంతక కమ్మ ,రెడ్డి కులాలను మరపించారు..
◆■ కొత్త కధనాలు..ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు..
■◆ భయపెట్టే వ్యూహాలు.మ్
◆●◆●◆●◆●◆
మాదిగ యువకుడు: మంథని మధుకర్...దొర జీతగాడు.
మున్నూరు కాపు యువతీ...
పాలేరును ప్రేమించింది...
పెళ్లి చేసుకుంటానని కుటుంబంతో కొట్లాడింది...
వీరి మధ్య ప్రేమకు సహకరించిన మిత్రుడు, కుటుంబ సభ్యుడే... హత్యకూ సహకరించాడు..
యువకుణ్ణి నమ్మించి తీసుకెళ్లి హంతకులకు అప్పజెప్పారు..
◆ అమ్మాయి ముందే కొట్టారు... వద్దు నాన్నా.. వాడు నాకు బాగా నచ్చినవాడు.. అన్నా వినకుండా కొట్టారు..
◆ అమ్మాయి పురుగుల మందు తాగిందట..
13 నా మాయం అయినా వాడి ఆచూకీ తెలియక యువకుడి కుటుంబము అల్లాడింది
◆ 14 అబ్బాయింట్లో ఫోన్ మ్రోగింది.. అమ్మాయి ఏడుస్తూ అడిగింది..మధు వచ్చాడా? మీ ఇంటి దగ్గర కాలువ దగ్గర్లో వెతకండి.. ప్లీజ్ అంకుల్ వెతకండి అంటూ బ్రతిమి లాడింది..
◆ ఎక్కడ వెతికినా మధుకర్ దొరకలేదు...
◆ తొడ బుట్టిన ఐదుగురు సోదరులు, ఇతర బంధువులు ఎవరికీ మధు చిక్క లేదు....
●●● కంచికచెర్ల కోటేశు మళ్ళీ చంపబడ్డాడు .. ఈ నేల మీద ...
◆మధుకర్ ఆచూకీ దక్కని కుటుంబం పోలీసులకు సమాచారమిచ్చారు.
◆ పోలీసులు అమ్మాయికి ఫోన్ చేశారు.బంధువులు ఫోన్ కట్ చేశారు.వివరాలు చెప్పలేదు.
◆ బంధువులు నేరుగా హంతకుల దగ్గరికే వెళ్లి నిలదీశారు.. మా వాడి శవమెక్కడా??
◆ నిర్భయంగా అడ్రస్ చెప్పిన గ్రామ సర్పంచ్.. ఓదెలు..
◆ వేగులను నేరుగా ఇంటికే పంపి శవం ఆచూకీ చెప్పిన వైనం వారి బరితెగింపుకు తార్కాణం..
◆◆పోలీసుల వత్తాసు హాంతకులకే ◆◆
◆ యువకుడి ఆత్మ హత్య అంటూ ప్రచారం..వెంటనే మార్చురీకి తరలింపు..గాయలేమీ లేవని CI ప్రకటన..
◆●◆ మనుస్మృతిలో పొందుపరచిన శిక్షలు, హింస పద్ధతులన్నింటినీ ఆ బిడ్డ శరీరం మీద అమలు పరిచారు.
◆ ప్రేయసి పట్ల ప్రేమను కళ్ళల్లో నింపుకున్నందుకు...
కళ్ళు పొడిచేశారు
◆ ఆమెతో రమించాడేమోనని
..పురుషాంగం కోసి మాయం చేశారు
◆ మెడలు విరిచేశారు..
◆ జబ్బలు విరిచి, పక్కటెముకల్లో ఇనురాడ్ల తో కసితీరా కొట్టారు.
◆ కాళ్ళు, తొడలు, చేతులు.. ఎక్కడనీ లేదు.. ఒళ్ళంతా గాయాలు చేశారు.
◆◆◆ అయినా CI ఆత్మ హత్యే నంటాడు..
◆◆ ప్రశ్నించిన ప్రజలను తంతానంటాడు..
◆ ఎందుకంటే అమ్మాయి MLA పుట్టా మధు గారి బంధువు..
●కన్న తండ్రి, పెద్ద నాన, మేన మామ, అన్న, మేనల్లుడు,బావా.. ఒక హంతక ముఠా గ మారి చంపారు.
◆ ముఠా నాయకుడు , సూత్రధారి మాత్రం MLA పుట్ట మధు నే...
◆ హత్యా కాండకు కాపలాదారు MLA కావలి కుక్క CI ప్రభాకర్..
◆ అందుకే ఇది ఆత్మహత్య అంటాడు.ఫిర్యాదు తీసుకొడు. నిందితులను అరెస్ట్ చెయ్యడు.
◆ ఆందోళన చేసిన దళిత సంఘాలను , ప్రజలను బెదిరించి శవాన్ని తరలించి చావు ముగించాడు.
◆ బంధువులు శవాన్ని ఖననం చేశారు.
◆◆ రిపోస్టు మార్టం కోసం ఉద్యమిద్దాం....
◆◆ హంతకులను శిక్షించమని పోరాడదాం..
◆ ఫోటోలు చూసే ధైర్యం ఉంటె చూడండి..
- బూరం అభినవ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కుల నిర్మూలనా పోరాట సమితి KNPS
తెలంగాణ రాష్ట్రం.
Comments
Post a Comment