ఐపీఎల్ మళ్లీ మొదలవుతుంది
హైదరాబాద్‌లో ప్రారంభ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకాలేని వారి కోసం ఏదైనా చేయాలని ఆలోచించిన నిర్వాహకులు కొత్త ఒరవడికి తెరలేపారు. ఈ సీజన్‌లో సుమారు 8 మైదానాల్లో ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతి జట్టు హోమ్ గ్రౌండ్‌లో ఆడే తొలి మ్యాచ్‌కి ముందు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, ఇండోర్, ముంబయి, పుణె, రాజ్‌కోట్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ క్రమంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ప్రారంభ వేడుకల్లో శ్రద్ధాకపూర్ తన డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈ కార్యక్రమానికి శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ కూడా హాజరవుతారట. అలాగే రాజ్‌కోట్‌లో నిర్వహించే వేడుకల్లో టైగర్ ష్రాఫ్ ధూమ్ సినిమాలోని పాటకు నర్తించనున్నారు.
Gud
ReplyDelete