మధుకర్ ఆత్మహత్య లేఖ

నా పేరు మధుకర్

మాది తెలంగాణా లో మంథాని గ్రామం. సమాజం అంతా గొప్పగా పొగిడి ఎంతో మర్యాదనిచ్చే దళిత కులం లో పుట్టాను. వయస్సు వచ్చిన తరువాత సమాజం చేత హీనంగా చూడబడే మున్నూరు కాపు అనే ఒక కులం అమ్మాయిని ప్రేమించాను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్ర్రాణం. మాది అగ్రకులం కాబట్టి మా పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు..అది తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించు కొన్నాను. మాములు గా అయితే కాలువ లోకి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చు..కానీ నాది గొప్ప జాతి కదా..అందుకే చాలా పద్దతిగా అత్యంత దారుణంగా ప్రపంచంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించుకొన్నాను.

అది నా ప్రేయసికి కూడా చెప్పాను తాను కూడా సరే అంది. ఏ చెరువులో దూకుతానో చెప్పాను కానీ ఎప్పుడు దూకుతానో చెప్పలేదు..నా లాగా ఇంకెవ్వడు ఆత్మహత్య చేసుకోలేడు అని ప్రపంచం నివ్వెరపోయేలా చేసుకున్నాను..ముందుగా..ఒక బలమైన కర్ర తీసుకొని నా పక్కటెముకలు నుజ్జు నుజ్జు ఆయ్యెన్తవరకు కొట్టుకొన్నాను..నా ముఖాన్ని నేనే రాయితో కొట్టుకొని నా కళ్ళు నేనే పొడుచు కొన్నాను. నా ప్రేమని ఇంకా వ్యక్తపరచాటానికి నా మర్మాంగాలను నేనే కోసుకొన్నాను..అయినా నాకు చావు రాలేదు..అందుకే ఆఖరిగా చెరువు లో దూకేసాను..నా శవం ఎవ్వరికంట పడకుండా..ఒక మూలకి చేరిపోయాను..ఇది తెలుసుకొన్న మా గ్రామస్థులు నన్ను వెతికి పట్టుకున్నారు..నన్ను అంటే నా శవాన్ని..మా ఊరి పోలీసులు చాలా తెలివైన వాళ్లు.. వెంటనే నాది ఆత్మహత్య అని తేల్చేశారు..ఎందుకంటే నేను చెసుకొన్నది ఆత్మహత్య కదా..అందరూ ఒప్పుకున్నారు..పాపం ఇప్పుడు నేను ప్రేమించిన పిల్ల కూడా ఆత్మ హత్య చేసుకొంటుందేమో..ఇదిలా ఉంటె ఈ దళిత ఉద్యమకారులందరు ఇది ఆత్మహత్య కాదు హత్య అని అంటున్నారూ..అది అసలు ఎలా సాధ్యం మనిషన్న వాడు ఇంకొక మనిషిని ఇంత కృరంగా చంపగలడా..అబ్బే అలా చంపలేడు.. ఇది ముమ్మాటికీ ఆత్మ హత్యే..కేవలం ఆత్మహత్య చేసుకొనే వాడే..వాడి మర్మాంగాలు వాడే కోసుకోగలడు..వాడి ఎముకలు వాడే విరుచుకోగలడు..వాడి కళ్ళు వాడు పీకుకోగలడు. .అవును ఇది ఆత్మహత్య.. ఎందుకంటే ఆత్మ నైనా నేను చెప్తున్నాను కనుక.

ఇట్లు
నా ఆత్మ

ఇంకేం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్ధం కాక ఇలా రాసాను*..మానవత్వం* మీలో ఇంకా మిగిలి ఉంటే కులాలకీ మతాలకీ అతీతంగా..ఒక్కసారి అయిన మనిషిగా మీ గొంతు విప్పండి..*మనిషి గా ఆలోచించటం అరుదైన ఈ సమాజంలో కనీసం ఇటువంటి సమయం లో అయినా ఒకసారి మనిషిగా ఆలోచించండి.* మీకు నామోషీ అనిపించకపోతే షేర్ చెయ్యండి..నలుగురికి అసలు నిజం తెలిసే వరకు..

డిమాండ్స్ :

- హత్యని ఆత్మహత్య గా చిత్రీకరించనది ఎవ్వరైనా ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు
- మంథని మధుకర్ మర్మాoగాలు కోసి అతి దారుణంగా అత్యచేసిన దుండగులను అరెస్ట్ చేయాలి.
- అత్యకు పురికోల్పిన మంథని MLA రౌడీ పుట్టమధుపై Sc/ST atrocity కేసు నమోదుచేసి,MLA పదవి నుండి తొలగించాలి.
- హత్యను ,ఆత్మహత్య గా చిత్రీకరించి కేసును తప్పు తోవ్వ పట్టిస్తున్న ,CI ప్రభాకర్,SI ఉపేందర్ లను డిస్మిస్ చేయాలి.
- రీ పోస్టుమార్టం నిర్వహించి హై కోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలి.

Comments

Popular posts from this blog

ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు

ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema

దుబాయ్ లో జాగ్రత్త. . యుఎఇ లో కొత్త చట్టాలు