తెలంగాణ లో P&G విస్తరణ
- మంత్రి కెటిఆర్‌తో కంపెనీ ప్రతినిధుల భేటీ
: తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పి అండ్ జి) సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కార్యకలాపాల విస్తరణపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుతో పి అండ్ జి మేనేజింగ్ డైరెక్టర్ రజ్వానీ గురువారం నాడిక్కడ చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ ఏర్పాటుకు, కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అందించిన సహకారానికి రజ్వానీ..మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ సమీపంలో పి అండ్ జి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీని విస్తరించనున్నట్లు రజ్వానీ వెల్లడించారు. సుమారు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు రజ్వానీ తెలిపారు.
Comments
Post a Comment