జియో కి షాక్ ఇచ్చింది
జియో కి షాక్: నెలకు రూ 20లకే డాటా సేవలు.. న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. ఏ ప్రిల్ 1 నుంచి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా మరోవైపు అనేక స్వదేశీ, విదేవీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికం బిజినెస్‌పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటా విండ్ కన్నేసింది. దీంతో టెలికాం స్పేస్ లో మరొక గేమ్ చేంజర్‌గా నిలవనుంది. 3జీ, 4జీ సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఖాతాదారులకు సంవత్సరానికి రూ.200 వద్ద డేటా సేవలను అందించడానికి ఆలోచిస్తోంది. బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్‌టాప్ లను అందిస్తున్న డేటా విండ్ భారత టెలికాం వ్యాపారంలోకి రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చ్యువల్ నెట్వర్క్ ఆపరేటరింగ్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన మొదటి ఆరు నెలలపాటు సం.రానికి రూ.200 లతో డాటా సర్వీసులను అందించనుంది. ...
Comments
Post a Comment