ఫేస్బుక్ , వాట్సప్ లకు సుప్రీంకోర్టులొ ఎదురుదెబ్బ

ఢిల్లీ: సోషల్ మీడియాలో ఖాతాదారుల ప్రైవసీ నిబంధనల ఉల్లంఘన కేసులో వాట్సాప్, ఫేస్ బుక్ లకు మరోసారి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాట్సాప్, ఫేస్ బుక్ మీడియాలు ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు ఎదుర్కొంటున్నాయి. వీటిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహర్, జస్టీస్ డివై చంద్రచూడ్ లతో కూడాన ధర్మాసనం పిటీషన్ ను విచారించింది. దీనిపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
సోషల్ మీడియాలో ఖాతాదారులు వారివారి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా ఫేస్బుక్, వాట్సాప్ సంస్థలు నిబంధనలను రూపొందించుకోవడాన్ని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియాలో సమాచార భద్రత లేకపోవడంతో వినియోగదారుల ప్రైవసీకి నష్టం కలిగే ప్రమాదం ఉందని సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్డు ఈ ఏడాది ప్రారంభంలోనే సదరు సోషల్ మీడియా యాజమాన్యంతోపాటు కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్ లకు నోటీసులు జారీ చేసింది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దేశంలో 15.7కోట్ల సోషల్ మీడియా యూజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయని, ఇది హక్కుల ఉల్లంఘనే అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు

ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema

దుబాయ్ లో జాగ్రత్త. . యుఎఇ లో కొత్త చట్టాలు