పోలాండ్ లో భారత విద్యార్థిపై దాడి

పోలాండ్‌లో భారత విద్యార్థిపై దాడి
విచారణ చేపట్టామన్న సుష్మాస్వరాజ్‌
దిల్లీ: పోలాండ్‌లో ఓ భారత విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాంజన్‌ ప్రాంతంలోని ఓ ట్రామ్‌లో గత బుధవారం ఓ భారత విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఆ విద్యార్థి తన స్నేహితుడికి ఫోన్‌ చేయడంతో అతడు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే మళ్లీ తనపై దాడి జరుగుతుందన్న భయంతో బాధితుడు తన పేరును వెల్లడించేందుకు నిరాకరించాడు.
పోలాండ్‌ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌.. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు అందజేయాలని అక్కడ భారత రాయబారి అజయ్‌ బిసారియాను ఆదేశించారు. ‘పొలాండ్‌లో విద్యార్థిపై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం’ అని సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

Comments

Popular posts from this blog

ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు

ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema

దుబాయ్ లో జాగ్రత్త. . యుఎఇ లో కొత్త చట్టాలు