ప్రజలు తినే తిండి కూడా ప్రభుత్వ పర్మిషన్??
ప్రజలు ఏం తినాలో తినకూడదో నిర్ణయించే తీరు ఇదేనా? చచ్చిన మనిషి కాలుతున్న మెదడును తినే మహానుభావులున్న ఈ దేశంలో తమకు ఆహారమైన మాంసాన్ని తినే సాధారణ ప్రజలు పాపాత్ములా? ఒక పెద్ద రాష్ట్రం ఇప్పుడు మాంసం లేక.. ఉన్నా దొరక్క అల్లాడుతోంది. అక్రమ కబేళాలు ఉండకూడదన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సక్రమ కబేళాలను కూడా మూసివేసేంత భయ వాతావరణాన్ని సృష్టించడంలో నూటికి నూరుపాళ్లూ విజయవంతంమైంది. దీనిఫలితం మాంసాహారం అలవాటైన 80 శాతం జనాలకు మాంసం దొరక్కుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కబేళాల నిర్వాహకులు సమ్మె చేయటంతో ఎలాంటి మాంసం కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఫలితం.. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అక్షరాలా కూరగాయల భోజనం చే్స్తోంది. అసలు విషయం ఏమిటంటే మాంసాహారుల తిండి పద్ధతిని ఇలా ఎన్నాళ్లు అడ్డుకుంటారున్నదే. ఈ దేశ ప్రజల అదృష్టమో లేక దురదృష్టమో కానీ.. యోగులు అధికారంలోకి వచ్చినంత మాత్రాన జనం తిండి పద్ధతులను ఈ విధంగా కంట్రోల్ చేస్తారా, చేయవచ్చా.. జంతువుగా ఆవిర్భవించినప్పటి నుంచి మనిషి అలవాటు చేసుకున్న ఆ సహస్రాబ్దాల మాంసాహార అలవాటును కబేళాలు మూసివేసి ఎన్నాళ్లు అడ్డుకుంటారు అన్నదే ఇప్పుడు పజిల్‌గా మారిం...

Comments
Post a Comment