ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు
ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలు శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు ఇతర సెలబ్రిటీలు ఆంజనేయుడి ఆలయంతోపాటు రాముడి గుళ్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగానే మంత్రి హారీశ్ రావు సిద్దిపేట గణేశ్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామికి వెండి గదతో పాటు ఇతర ఆభరణాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.